విషాదం నింపిన విహారం.. లోయలో పడి సాఫ్ట్ వేర్ మృతి

by Shyam |   (  Updated:2021-10-05 02:29:52  IST  )

<p>దిశ, వాజేడు: తోటి మిత్రులతో కలిసి విహారయాత్రకు వచ్చిన సాఫ్ట్ వేర్  ఇంజనీర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకొంది. నీట మునిగి మృత్యువు ఒడిలోకి చేరిన సంఘటన పలువురిని కలచివేసింది. వివరాలలోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగల దూసలోదిపాటి జలపాతానికి విహార యాత్రకు హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఉదయాన్నే వచ్చారు. ఆ నలుగురులోని పెంట రాహుల్(33) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రమాదవశాత్తు కొంగల జలపాతం లోయలోకి జారిపోయి గల్లంతయ్యాడు. దీంతో [&hellip;]</p>

విషాదం నింపిన విహారం.. లోయలో పడి సాఫ్ట్ వేర్ మృతి
X

దిశ, వాజేడు: తోటి మిత్రులతో కలిసి విహారయాత్రకు వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకొంది. నీట మునిగి మృత్యువు ఒడిలోకి చేరిన సంఘటన పలువురిని కలచివేసింది. వివరాలలోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగల దూసలోదిపాటి జలపాతానికి విహార యాత్రకు హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యక్తులు ఉదయాన్నే వచ్చారు. ఆ నలుగురులోని పెంట రాహుల్(33) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రమాదవశాత్తు కొంగల జలపాతం లోయలోకి జారిపోయి గల్లంతయ్యాడు. దీంతో వెంటనే మిత్రులు పోలీసులకు సమాచారం అందివ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. చాలాసేపటి తరువాత రాహుల్ మృతదేహం బయటపడింది. మిత్రులతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన తోటి మిత్రుడు మృత్యువాత పడడంతో మిగతావారు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Next Story