2020లో ప్రపంచంలో ఎక్కువ సంపాదించిన హీరోయిన్ ఈమే!

by  |
2020లో ప్రపంచంలో ఎక్కువ సంపాదించిన హీరోయిన్ ఈమే!
X

దిశ, వెబ్‌డెస్క్:

2020 సంవత్సరం అత్యంత దురదృష్టకరమైన సంవత్సరం అని అందరి అభిప్రాయం. కానీ ఆ దురదృష్ట సమయాల్లోనూ కోట్లలో వెనకేసుకున్న సినీతారలు ఎంతో మంది ఉన్నారు. 2020 సంవత్సరంలో ఎక్కువ మొత్తంలో సంపాదించిన నటీమణుల వివరాలను ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం హాలీవుడ్ నటి సోఫియా వెర్గారా 2020లో అత్యంత ఎక్కువ సంపాదించుకున్న హీరోయిన్‌గా నిలిచింది. 2020లో ఈమె 43 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 315 కోట్లు గడించింది. ‘మోడర్న్ ఫ్యామిలీ, అమెరికాస్ గాట్ టాలెంట్’ కార్యక్రమాల ద్వారా ఆమె ఇంత మొత్తాన్ని సంపాదించగలిగారు.

తర్వాతి స్థానాల్లో ఏంజెలీనా జోలీ (35.5 మిలియన్ డాలర్లు), గాల్ గడాట్ (31 మిలియన్లు), మెలీసా మెక్‌కార్తీ (25 మిలియన్లు), మెరిల్ స్ట్రీప్ (24 మిలియన్లు), ఎమిలీ బ్లంట్ (22.5 మిలియన్లు), నికోల్ కిడ్‌మన్ (22 మిలియన్లు), ఎలెన్ పాంపియో (19 మిలియన్లు), ఎలిజబెత్ మోస్ (16 మిలియన్లు), వయోలా డేవిస్ (15.5 మిలియన్లు) ఉన్నారు. ఈ ఏడాది ఈ జాబితాలో కొత్తగా చేరిన హీరోయిన్ ఎమిలీ బ్లంట్. ‘క్వైయిట్ ప్లేస్: పార్ట్ 2, డిస్నీ వారి జంగిల్ క్రూయిజ్’ సినిమాలతో ఆమె ఈ జాబితాలో స్థానం సంపాదించుకోగలిగింది. గతేడాది మొదటి స్థానంలో నిలిచిన స్కార్లెట్ జోహాన్సన్ 56 మిలియన్ డాలర్లు సంపాదించింది. అంటే ఈ లెక్కన హీరోయిన్ల సంపాదన 20 శాతం తగ్గిపోయిందని ఫోర్బ్స్ వెల్లడించింది.



Next Story

Most Viewed