- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలియా-రణ్‌బీర్ బ్రేకప్.. కారణం కత్రినా?
<p>దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఆల్మోస్ట్ కన్‌ఫర్మ్ కాగా, ఈ జంట త్వరలోనే ఒకటి కాబోతోంది. ఇక అంతకన్నా ముందే రణ్‌బీర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా వివాహం జరగనుండగా.. నేడు మెహందీ, సంగీత్ ఈవెంట్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ మోస్ట్ సీక్రెట్ వెడ్డింగ్‌కు ఆలియా అటెండ్ కావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే గెస్ట్‌లందరూ రాజస్థాన్ చేరుకున్నప్పటికీ […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లి ఆల్మోస్ట్ కన్‌ఫర్మ్ కాగా, ఈ జంట త్వరలోనే ఒకటి కాబోతోంది. ఇక అంతకన్నా ముందే రణ్‌బీర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా వివాహం జరగనుండగా.. నేడు మెహందీ, సంగీత్ ఈవెంట్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ మోస్ట్ సీక్రెట్ వెడ్డింగ్‌కు ఆలియా అటెండ్ కావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే గెస్ట్‌లందరూ రాజస్థాన్ చేరుకున్నప్పటికీ ఆలియా మాత్రం ముంబైలోనే దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
దీంతో నెటిజన్లు ఈ యంగ్ హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఏం ఆలియా.. కాట్స్ మ్యారేజ్‌కు అటెండ్ కావడం లేదా? అని కొందరు కామెంట్ చేస్తే.. పెళ్లి కూతురు తన బాయ్‌ఫ్రెండ్‌కు మాజీ లవర్ కదా! వెళ్లడం కష్టమే అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరి రణ్‌బీర్‌ను అయినా వెళ్లనిచ్చిందా లేదా? అని ఇంకొందరు కామెంట్ సెక్షన్‌లో ప్రశ్నిస్తుంటే.. ఆ పనిచేస్తే ఇద్దరికీ బ్రేకప్ తప్పదన్న సమాధానాలే వినబడుతున్నాయి.






