రాష్ట్రంలో సామాజిక న్యాయం లోపించింది

by  |
రాష్ట్రంలో సామాజిక న్యాయం లోపించింది
X

దిశ, ముషీరాబాద్:
సబ్బండ వర్గాల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో నేడు సామాజిక న్యాయం పూర్తిగా లోపించిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మెజారిటీగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పిడికెడు శాతం లేనటువంటి రెండు కులాలు అణగదొక్కి రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయని మండిపడ్డారు. బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేషాచారి ఆధ్వర్యంలో హైదరాబాదులోని బీసీ భవన్ లో మహర్షి వాల్మీకి జయంతి, కుమరం భీమ్ వర్ధంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాల్మీకి, కుమరం భీమ్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. రామాయణాన్ని బీసీ వర్గానికి చెందిన వాల్మీకి చాలా గొప్పగా వ్రాసి చరిత్ర సృష్టించారని తెలిపారు. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడి అసువులు బాసిన కుమురం భీమ్ ఆశయాలు నేటికి నెరవేరడం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అర శాతం లేని వాళ్లకు టిక్కెట్లు ఇస్తున్నాయని అన్నారు. 2023 నాటికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంతా ఏకమై సామాజిక తెలంగాణ సాధన కోసం మరో పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొమ గోపి, బీసీ సంఘాల నాయకులు మల్లికార్జున్, మాదేశి రాజేందర్, రంజిత్, నవీన్, అరవింద్, బత్తిని రాజు, విజయ్, మనోజ్ చారి, బడే సాబ్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed