బ్లాక్ అండ్ వైట్‌లో బ్యాక్ లెస్ స్నేహా ఉల్లాల్

by  |
బ్లాక్ అండ్ వైట్‌లో బ్యాక్ లెస్ స్నేహా ఉల్లాల్
X

దిశ, సినిమా : కరుణాకరన్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ స్నేహా ఉల్లాల్. తన స్క్రీన్ ప్రజెన్స్, హెల్తీ రొమాంటిక్ లుక్స్‌తో కుర్రకారు మది దోచుకున్న ఈ భామకు ఆ సినిమా తర్వాత అవకాశాలు క్యూ కట్టినా.. అవేవీ సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో ‘సింహా’, వరుడు, అలా మొదలైంది’ చిత్రాల్లో నటించిన ఈ భామ చివరగా ‘మడతకాజా’ సినిమాలో కనిపించింది. కానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స్నేహ.. పర్సనల్ విషయాలతో పాటు తన హాట్ ఫోటోస్‌ను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుంది.

తాజాగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న బ్యాక్‌లెస్ ఫొటోను షేర్ చేసిన స్నేహ.. దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ యాడ్ చేసింది. ‘మీలో ఎంత మంది సోషల్ మీడియా పాస్‌వర్డ్స్‌ను మీ భాగస్వాములకు ఇవ్వగలరు? మీ సమాధానాల కోసం వెయిట్ చేస్తున్నా’ అని ప్రశ్నించింది. ఇన్‌స్టా వేదికగా ఆమె పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చాలా మంది తాము చెప్పగలమని కామెంట్లు చేస్తున్నారు. ఆల్రెడీ తమ పార్ట్‌నర్స్‌కు పాస్‌వర్డ్స్ తెలుసని కొందరు పోస్టులు పెడుతున్నారు. ప్రేమ స్వచ్ఛమైనదైనప్పుడు పాస్‌వర్డ్ చెప్పడానికి భయమెందుకని ఇంకొందరు ప్రశ్నించారు. కాగా ఈ కామెంట్స్‌ను చూసి హ్యాపీగా ఫీలైన స్నేహ.. నిజాయితీపరులు చాలా మందే ఉన్నారని పేర్కొంది. ఇక స్నేహ ఉల్లాల్ బ్యాక్‌లెస్ ఫొటోను చూసి ‘వావ్ సో హాట్, బ్యూటిఫుల్’ అని ప్రశంసిస్తున్నారు.


Next Story