బాలయ్యకు జోడీగా స్నేహ

by  |
బాలయ్యకు జోడీగా స్నేహ
X

నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇది వీరి కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కాగా.. బాలయ్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంది. కాగా, ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించబోతుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర అని సమాచారం.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ నటి స్నేహను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు భార్యగా కనిపించబోతున్న స్నేహ.. సినిమాకు కీలకం కానుందట. ఇక మెయిన్ హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని పరిచయం చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా బాలయ్య ఈ విషయంపై క్లారిటీ ఇవ్వగా.. మరో ముఖ్యమైన పాత్రలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కనిపించనున్నారని టాక్.

లాక్‌డౌన్‌కు ముందుగా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో విలన్ల గురించి కూడా బోయపాటి భారీ కటౌట్ల కోసం వెతుకుతున్నారు.‌ మొత్తం ముగ్గురు విలన్లను సెట్ చేయగా.. సంజయ్ దత్, సునీల్ లాంటి పేర్లు కూడా ఈ లిస్ట్‌‌లో ఉన్నాయి.

Next Story