ప్రియాంక చోప్రా కొత్త ఇల్లు చూశారా?

by  |
ప్రియాంక చోప్రా కొత్త ఇల్లు చూశారా?
X

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్‌లు కలిసి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలీస్‌లో ఎన్చినో ప్రాంతంలో ఒక పెద్ద ఇల్లు కొన్నారు. ఆ ఇల్లుకి సంబంధించిన ఫొటోలు ఇటీవల బయటకి పొక్కాయి. మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లుని 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 142 కోట్లు) పెట్టి కొన్నారు.

ఇల్లు ప్రత్యేకతలు

ఈ మ్యాన్షన్‌లో మొత్తం 7 పడక గదులు, 11 బాత్రూంలు ఉన్నాయి. మొత్తం ఈ లోయ అందాలన్నీ ఈ ఇంట్లో కూర్చుని చూసేయొచ్చు. ఇంకా ఈ ఇంట్లో పెద్ద గ్యారేజ్, అద్దాలతో చేసిన జిమ్, ఐమాక్స్ సౌకర్యం ఉన్న సినిమా థియేటర్, రెండు లేన్ల బౌలింగ్ స్థలం, వెట్ బార్, ఇండోర్ బాస్కెట్‌బాల్ కోర్టు, ఒక ఇన్ఫినిటీ పూల్ ఉన్నాయి. వీటితో పాటు ఇళ్లంతా ఒక అద్దాల మేడలా కనిపిస్తూ లోపల అందమైన పెయింటింగులు, ఖరీదైన వస్తువులతో నిండి ఉంటుంది.



Next Story

Most Viewed