హీరోలకు గుర్రంలా పనిచేయడానికి నేను గ్లామ్ గర్ల్‌ను కాదు.. అయేషా

by Disha Web Desk 9 |
హీరోలకు గుర్రంలా పనిచేయడానికి నేను గ్లామ్ గర్ల్‌ను కాదు.. అయేషా
X

దిశ, సినిమా: బాలీవుడ్ సినిమాల నుంచి తప్పుకోవడానికి బలమైన కారణాలున్నాయంటోంది అయేషా జుల్కా. ఇటీవల వరుస వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్న ఆమె రీసెంట్‌గా ‘హ్యాపీ ఫ్యామిలీ కండిషన్స్ అప్లయ్’ అనే సిరీస్‌తో అభిమానులను అలరించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన అమ్మాయిలు గ్లామ్ గర్ల్‌గా ఉండటం మంచిదే అయినప్పటికీ ప్రతి నటి అప్‌గ్రేడ్ కావాలని చెప్పింది. అయితే తాను మాత్రం ఎక్కువ కాలం అందంగా కనిపించడం, పాటల్లో నటించడం, హీరోతో రొమాన్స్ చేయడం వంటి రొటీన్ క్యారెక్టర్స్ చేయాలనుకోలేదని తెలిపింది.

అలాగే తాను పోషించిన పాత్రలకు వేర్వేరు పేర్లు ఉన్నప్పటికీ, అవి దాదాపు ఒకేలా ఉన్నాయన్న నటి.. ‘నాకు ఎవరి పట్ల వ్యతిరేకత లేదు. కానీ గుర్రం మాదిరి ఒకే రకమైన పని చేస్తున్నట్లు అనిపించింది. అది సంతృప్తిని కలిగించలేదు. నా సామర్థ్యాన్ని పెంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని చెప్పుకొచ్చింది. ‘జో జీతా వోహీ సికందర్’, ‘హిమ్మత్ వాలా’ వంటి అనేక చిత్రాల్లో నటించింది అయేషా జుల్కా.

Also Read...

జిమ్‌లో గ్లామర్ షో.. జాన్వీ స్లిమ్ ఫిట్‌ అందాలకు నెటిజన్లు ఫిదా!



Next Story

Most Viewed