TG: ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి పాముకాటు

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-20 17:09:28  IST  )

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

TG: ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి పాముకాటు
X

దిశ, దుమ్ముగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని గౌరారం ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి విద్యార్థిని నవ్యశ్రీకి ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా పాము కాటు వేసిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనను గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో నవ్యశ్రీని తక్షణమే దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది తొలి చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్య సేవల కోసం నవ్యశ్రీని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నిర్వహించిన వివిధ పరీక్షల్లో ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని నిర్ధారించారు. సకాలంలో చికిత్స అందడంతో నవ్యశ్రీ పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతీర్, వార్డెన్ లక్ష్మీపతి, ఉపాధ్యాయులు, నవ్యశ్రీ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story