వీరప్పన్ కూతురు బీజేపీలోకి..

by Shamantha N |

<p>ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యా రాణి శనివారం బీజేపీలో చేరారు. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో నిర్వహించిన ఓ సమావేశంలో బీజేపీ కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్రమాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. మతం, కులాలకు అతీతంగా అణగారిన ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారని ఈ సందర్భంగా విద్యా రాణి అన్నారు. ప్రధాని ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలనుకుంటున్నారని తెలిపారు. విద్యారాణితోపాటు ఇతర పార్టీల నుంచి దాదాపు 1000 [&hellip;]</p>

వీరప్పన్ కూతురు బీజేపీలోకి..
X

ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యా రాణి శనివారం బీజేపీలో చేరారు. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో నిర్వహించిన ఓ సమావేశంలో బీజేపీ కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్రమాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. మతం, కులాలకు అతీతంగా అణగారిన ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారని ఈ సందర్భంగా విద్యా రాణి అన్నారు. ప్రధాని ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలనుకుంటున్నారని తెలిపారు. విద్యారాణితోపాటు ఇతర పార్టీల నుంచి దాదాపు 1000 మంది బీజేపీలోకి చేరారు. కలప స్మగ్లర్ వీరప్పన్.. పోలీసుల ఆపరేషన్‌లో మరణించిన విషయం తెలిసిందే.

Read also..

ఢిల్లీలో మరో షహీన్‌బాగ్!

Next Story