ఈ వీడియో చూసి మీరు నవ్వకుండా ఉండగలరా?

by  |
witty captions
X

దిశ, ఫీచర్స్: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఇన్‌స్పైరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇష్యూస్‌పై చర్చిస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో డిఫరెంట్ ఇండియన్ రెసిపీస్, ట్రెడిషన్స్‌పై కూడా తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఇన్‌స్టా వేదికగా తను షేర్ చేసిన వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఆ వీడియో చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. కాగా ఈ వీడియోను ముంబై పోలీస్ శాఖ తమ ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేయగా, నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

‘మీ సీఏ మిత్రుడు మార్చి నెల వారాంతంలో’ ఇలా ఎంజాయ్ చేస్తాడని క్యాప్షన్ పెడుతూ #fantasticfriday, #dostonperehemkaro హ్యాష్‌ట్యాగ్స్‌తో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ వీడియో షేర్ చేసింది. దీనిని చూసి పలువురు నెటిజన్లు వారి ప్రదర్శన ‘సూపర్బ్’ అని ప్రశంసలు కురిపిస్తుండగా.. ‘మార్చి నెలలో ఉద్యోగులు ఈ వీడియోలో మాదిరి పర్ఫార్మ్ చేస్తారని’ కొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా ముంబై పోలీస్ విభాగం మాత్రం ఈ వీడియోను హ్యాకర్స్ పట్ల ప్రజల్లో అవేర్‌నెస్ క్రియేట్ కోసం యూజ్ చేయడం విశేషం. ఇన్‌స్టా హ్యాండిల్‌లో ‘మీరు కనుక వీక్ పాస్‌వర్డ్ పెట్టుకున్నట్టయితే హ్యాకర్స్ ఈజీగా మీ అకౌంట్లోకి ఎంటరై ఇలా ఎంజాయ్ చేస్తారని’ పేర్కొంటూ స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఫర్ అకౌంట్స్ ఇంపార్టెన్స్ తెలిపే ప్రయత్నం చేశారు. ప్రతీ ఒక్కరు తమ బ్యాంక్, సోషల్ మీడియా ఇతర అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలని సూచించారు.



Next Story