టీఆర్‍ఎస్‍, ఎంఐఎంది అవినీతి కూటమి

by  |
టీఆర్‍ఎస్‍, ఎంఐఎంది అవినీతి కూటమి
X

దిశ, వెబ్ డెస్క్: అక్రమ చొరబాటు దారులకు టీఆర్‌ఎస్, ఎంఐఎం మద్దతిస్తున్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె హైదరాబాద్‎కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోహింగ్యాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. వారిపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. రోహింగ్యాలను టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి తమ రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. రోహింగ్యాలను నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల లిస్టులో చేర్చారని.. ఇది టీఆర్ఎస్, ఎంఐఎం అవినీతి కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తూనే ఉందన్నారు స్మృతి ఇరానీ. దీంతో బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. దుబ్బాకలో సైతం బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో వరదల కారణంగా 80 మంది చనిపోయారని, వరద నష్టంపై ఇప్పటి వరకూ ప్రభుత్వం సమగ్ర నివేదికలను కేంద్రానికి పంపలేదని ఆమె దుయ్యబట్టారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్నదే తమ నినాదమని, ఆ నినాదంతోనే ముందుకెళ్తామని ఇరానీ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed