- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవిశ్రీకి స్వాగతం పలికిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’
<p>దిశ, సినిమా : శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా.. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. ఇదిలా ఉంటే.. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ మేరకు ప్రొడక్షన్ హౌస్ ఎస్‌ఎల్‌వీ సినిమాస్.. దేవిశ్రీ ప్రసాద్‌కు వెల్‌కమ్ చెప్తూ ట్వీట్ చేసింది. ఇక ‘ఆడవాళ్ళు […]</p>

దిశ, సినిమా : శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా.. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. ఇదిలా ఉంటే.. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ మేరకు ప్రొడక్షన్ హౌస్ ఎస్‌ఎల్‌వీ సినిమాస్.. దేవిశ్రీ ప్రసాద్‌కు వెల్‌కమ్ చెప్తూ ట్వీట్ చేసింది.
ఇక ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టైటిల్ చూస్తుంటే.. సినిమాలో ఫిమేల్ క్యారెక్టర్స్‌కు ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చిత్రానికి ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న చిత్రంలో ‘వెన్నెల’ కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణి తదితరులు నటిస్తున్నారు. ఇక ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్‌గా సుజిత్ సారంగ్ పనిచేస్తున్నారు.
Team #AadavaalluMeekuJohaarlu welcomes the musical magician Rockstar @ThisIsDSP on board 🎵@ImSharwanand @iamRashmika @DirKishoreOffl @sujithsarang pic.twitter.com/ZRnFKuuzfS
— SLV Cinemas (@SLVCinemasOffl) July 22, 2021






