- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతిపై వృద్ధుడి అత్యాచారం
<p>దిశ వెబ్ డెస్క్ : మతిస్థిమితం సరిగా లేని యువతికి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించి వృద్ధుడు లైంగికదాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా , ఇల్లంతకుంటలో ఆలస్యంగా వెలుగుచూసింది. మతిస్థిమితం సరిగాలేని యువతిపై జాలి, కరుణలేకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు వృద్ధుడు. అయితే ఈ ఘటన బాధితురాలు ఆలస్యంగా కుటుంబసభ్యులకు తెలుపడంతో బయటపడింది. దీంతో కుటుంబసభ్యులు గురువారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం […]</p>

దిశ వెబ్ డెస్క్ : మతిస్థిమితం సరిగా లేని యువతికి కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించి వృద్ధుడు లైంగికదాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా , ఇల్లంతకుంటలో ఆలస్యంగా వెలుగుచూసింది. మతిస్థిమితం సరిగాలేని యువతిపై జాలి, కరుణలేకుండా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు వృద్ధుడు.
అయితే ఈ ఘటన బాధితురాలు ఆలస్యంగా కుటుంబసభ్యులకు తెలుపడంతో బయటపడింది. దీంతో కుటుంబసభ్యులు గురువారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ సంఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశం అయింది.
వివరాల ప్రకారం.. ఓయువతికి కొన్ని రోజుల నుంచి మతిస్థిమితం లేదు. దానిని ఆసరాగా తీసుకొని 60సంవత్సరాల వృద్ధుడు లైంగిక దాడిచేశాడు. తనకు తెలియకుండా కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి లైంగికదాడి చేసినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు మొదట గోప్యంగా ఉంచి, నాలుగురోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.






