- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు జిల్లాలో దారుణం.. ఆరుగురు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో రొయ్యల చెరువు వద్ద కరెంట్ షాక్ తగిలి ఆరుగురు కాపలదారులు మృత్యువాతపడ్డారు. వివరాల ప్రకారం.. ఒడిషాకు చెందిన కొందరు వ్యక్తులు రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో రొయ్యల చెరువు గట్టున ఉన్న షెడ్డుపై కరెంటు తీగలు తెగి పడిపోయాయి. అది గమనించని పనివాళ్లు అటు వైపుగా వెళ్లడంతో కరెంట్ షాక్ తగిలి వారంతా మృతి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో రొయ్యల చెరువు వద్ద కరెంట్ షాక్ తగిలి ఆరుగురు కాపలదారులు మృత్యువాతపడ్డారు. వివరాల ప్రకారం.. ఒడిషాకు చెందిన కొందరు వ్యక్తులు రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో రొయ్యల చెరువు గట్టున ఉన్న షెడ్డుపై కరెంటు తీగలు తెగి పడిపోయాయి.
అది గమనించని పనివాళ్లు అటు వైపుగా వెళ్లడంతో కరెంట్ షాక్ తగిలి వారంతా మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతులను రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్‌గా గుర్తించారు. అయితే, షార్ట్ సర్క్యూట్ జరగలేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story






