- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే కుటుంబంలో ఆరుగురిని బలిగొన్న కరెంట్ తీగ
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతార్‌పూర్ జిల్లా బీజావర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలగా.. ఒకరని కాపాడబోయి మరొకరు ఇలా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ విషాదకరమైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతార్‌పూర్ జిల్లా బీజావర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలగా.. ఒకరని కాపాడబోయి మరొకరు ఇలా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఈ విషాదకరమైన ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురికీ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






