- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండలో ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
<p>దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేర్వేరుగా జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తోన్న ఓ కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముత్యాలమ్మగూడెంలో జరిగిన మరో ప్రమాదంలో మరో ముగ్గరు మృతిచెందారు. ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. సమాచారం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేర్వేరుగా జరిగిన రెండు ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తోన్న ఓ కారు కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ముత్యాలమ్మగూడెంలో జరిగిన మరో ప్రమాదంలో మరో ముగ్గరు మృతిచెందారు. ఈ రెండు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గణేష్ నిమజ్జనం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతోనే ఈ ప్రమాదాలు జరిగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Ganesh immersion
Next Story






