Cloud Burst: ఆరుగురు దుర్మరణం.. వైష్ణోదేవియాత్ర నిలిపివేత

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-26 12:28:18  IST  )

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

Cloud Burst: ఆరుగురు దుర్మరణం.. వైష్ణోదేవియాత్ర నిలిపివేత
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir)లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఇవాళ క్లౌడ్ బరస్ట్ కావడంతో భారీ వరదలు సంభవించాయి. వైష్ణోదేవి యాత్ర(Vaishno Devi Yatra) మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు యాత్రికులు దుర్మరణం(Five Dead) చెందగా, మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. జోజులా పాస్ మార్గంలో కూడా క్లౌడ్ బరస్ట్ కావడంతో లడఖ్ మార్గాన్ని మూసి వేశారు. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం వైష్ణోదేవి యాత్రను సైతం నిలిపివేశారు. కొండచరియలు విరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, కథువా, సాంబ, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్ట్వార్ సహా జమ్మూలోని పలు ప్రాంతాల్లో వర్ష హెచ్చరికలు చేశారు. పలు చోట్ల నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండగా, చాలా ప్రాంతాల్లో వరదముప్పు నెలకొంది. నదీ పరిసర ప్రాంతాల ప్రజలు ఇళ్లలోంచి బయటకు వెళ్లవద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది.

Next Story