బాలయ్య కోసం వెయిటింగ్..

by  |
బాలయ్య కోసం వెయిటింగ్..
X

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో డబుల్ రోల్ చేస్తున్న బాలయ్య.. ఒక పాత్రలో అఘోరాగా కనిపిస్తారనేది కన్‌ఫర్మ్ అయింది. ఈ సినిమా తర్వాత బాలయ్య డేట్ల కోసం వెయిట్ చేస్తోంది టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యానర్.. సితార ఎంటర్‌టైన్‌మెంట్. మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసిన నిర్మాత వంశీ.. బాలయ్యను ఈ సినిమాలో నటించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ప్రసాద్ లాబ్స్‌లో మూవీ స్క్రీనింగ్ తర్వాతే తన నిర్ణయం చెప్తా.. అన్నాడట బాలయ్య బాబు.

ఇదిలా ఉంటే, ఇప్పటికే ఈ సినిమాలోని కోషి పాత్రకు రానా ఒప్పుకున్నట్లు.. నిర్మాత అతనికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అహంకారంతో నిండిన ఈ పాత్రకు రానా కరెక్ట్‌గా సెట్ అవుతుండగా.. బిజు మీనన్ చేసిన రోల్‌కు బాలకృష్ణ పర్‌ఫెక్ట్ అని చెబుతున్నాడు నిర్మాత. అందుకే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మిగతా నటీనటులు, డైరెక్టర్, టెక్నీషియన్స్‌ను ఫైనల్ చేయాలని చూస్తున్నారట.

ఇద్దరు అహంకారంతో నిండిన వ్యక్తుల మధ్య సాగే కథే.. అయ్యప్పనుమ్ కోషియుమ్ కాగా.. ఈ చిత్రానికి సచి రచయిత, దర్శకుడు. ఇతనికి దర్శకుడిగా ఇదే తొలి సినిమా కాగా.. ఇంతకు ముందు డ్రైవింగ్ లైసెన్స్ చిత్రానికి కూడా రచయితగా పనిచేశాడు. ఇక తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించేందుకు పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా, హరీష్ శంకర్, సుధీర్ వర్మల్లో ఎవరైనా ఒకరు చేసే చాన్స్ ఉందట.



Next Story

Most Viewed