చిన్నారి సితార స్టెప్పులు.. పొంగిపోయిన ప్రిన్స్

by  |
చిన్నారి సితార స్టెప్పులు.. పొంగిపోయిన ప్రిన్స్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార… చిన్నప్పటి నుంచే తెలుగు ప్రజలకు దగ్గరైంది. మహేష్ కూతురిగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. సీత పాప అప్పుడే ఇంత పెద్దగా అయిపోయిందా అనిపించేలా… ఈస్టర్ ను పురస్కరించుకుని ఓ వీడియో షేర్ చేసింది నమ్రత శిరోద్కర్. ఆగడు సినిమా షూటింగ్ టైమ్ లో సరోజా పాటకు చిన్నారి సితార వేసిన స్టెప్పులను ఈస్టర్ కానుకగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వీడియోలో సితారా స్టెప్పులు వేస్తుంటే వెనకాల మహేష్ బాబు తన కూతురిని చూసి నవ్వడం వీడియోలో హైలెట్. కాగా ప్రిన్సెస్ సితార తన తండ్రి సినిమా పాటలకు డాన్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ఉంటుంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ కు స్టెప్పులు వేసి అలరించింది. అంతే కాదు తన స్నేహితురాలితో కలిసి యూట్యూబ్ చానల్ ఓపెన్ చేసిన సితార… సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తుంది కూడా.

Tags: Mahesh Babu, Namrata Shirodkar, Sitara, Aagadu Movie, Easter


Next Story