రేవంత్‌ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క.. రేవంత్ ఏమన్నారంటే.?

by  |
రేవంత్‌ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క.. రేవంత్ ఏమన్నారంటే.?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ, అనుబంధం, సోదర-సోదరీ భావానికి నిదర్శనం రాఖీ పండుగ. ఈ పండగ సందర్భంగా ఆదివారం ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ క్రమంలో రాఖీ కట్టిన ఫోటోలను రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి.. ప్రతీ ఆడబిడ్డ ఆత్మవిశ్వాసంతో, ఆర్థిక స్వావలంబనతో, అన్ని రంగాలలో ఎదగాలని మనసారా కోరుకుంటున్నా అంటూ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీతక్క.. మాట్లాడుతూ అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్లకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story

Most Viewed