తండ్రి మరణం తట్టుకోలేక అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మరణం తట్టుకోలేక అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ప్రొద్దుటూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో బాబు రెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చేతిలో కూతురు పడుతున్న చిత్రహింసలు చూడలేక అతను ఆత్యహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆయన కూతుర్లు శ్వేత, సాయి అనే ఇద్దరు కూడా తండ్రి మరణం తట్టుకోలేక రైలు కిందపడి [&hellip;]</p>

తండ్రి మరణం తట్టుకోలేక అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మరణం తట్టుకోలేక అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ప్రొద్దుటూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో బాబు రెడ్డి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భర్త చేతిలో కూతురు పడుతున్న చిత్రహింసలు చూడలేక అతను ఆత్యహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆయన కూతుర్లు శ్వేత, సాయి అనే ఇద్దరు కూడా తండ్రి మరణం తట్టుకోలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రి నుంచి తండ్రి మృతదేహం ఇంటికి చేరేంతలోపే అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story