ఎల్లలు దాటిన సిరిసిల్ల కుర్రాడి ప్రేమ..

250

దిశ, సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన జొన్నకంటి భరత్ హెయిర్ స్టైలిస్ట్ కోర్సు నేర్చుకున్నారు. గ్రామంలో తన తండ్రి ఏర్పాటు చేసిన సెలూన్ షాపును చూసిన భరత్ ఈ కోర్స్ వైపు ఆకర్షితులయ్యాడు. 2017లో అమెరికా దేశంలోని కార్నివాల్ క్రూజ్ షిప్‌లో స్పా సెంటర్‌లో హెయిర్ స్టైలర్‌గా ఉద్యోగం రావడంతో జాబ్ వీసాపై విమానం ఎక్కాడు. అక్కడే తనకు తనతో పాటు పని చేస్తున్న డాక్టర్ క్రీజియా లీవర్ లింటోన్ పరిచయం అయ్యారు. ఒకే చోట విధులు నిర్వర్తిస్తుండడంతో ఇద్దరి ఆభిప్రాయాలు షేర్ చేసుకున్నారు.

అయితే వీరు పని చేస్తున్న స్పా సెంటర్‌లో ఇతర ఉద్యోగులు ఉన్నప్పటికీ క్రీజియాకు భారతీయ విధానం అంటే మక్కువ ఎక్కువగా ఉండడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో అమెరికాలో చాలామంది వెకేషన్స్ కోసం నెల రోజుల పాటు షిప్‌లలో ప్రయాణిస్తుంటారు. కుటుంబ సమేతంగా టూర్ చేసే వీరికి సేవలందించేందుకు స్పా సౌకర్యం కూడా ఉంటుంది. ఈ షిప్‌లో భరత్, క్రీజియాలకు డ్యూటీ పడింది. ఈ సమయంలో వీరిద్దరి మధ్య పెళ్లి ప్రపోజల్ రాగా ఇరువురు తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇందుకు వారు కూడా ఇందుకు సమ్మతించారు. దీంతో వీరిద్దరూ కొలంబియాలోని షాన్ ఆండ్రెస్‌లో సోమవారం రాత్రి అక్కడి సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

ఇక్కడి సాంప్రదాయంలో కూడా…

క్రీజియా కుటుంబ ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నామని భరత్ తెలిపారు. అయితే కరోనా ప్రభావం తగ్గితే వచ్చే ఏప్రిల్ మాసంలో భారతీయ ఆచారం ప్రకారం.. పెళ్లి చేసుకుంటామని తెలిపారు. రాచర్ల గొల్లపల్లిలో తాము ఇక్కడి ఆచారం ప్రకారం వివాహం చేసుకోనున్నామన్నారు. క్రీజియాకు భారతీయ సాంప్రదాయాలపై ఉన్న మక్కువ. వల్లే తమ వివాహానికి ప్రధాన కారణమని భరత్ వివరించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..