సింగర్ సునీత పెళ్లి డేట్ ఫిక్స్

by  |
సింగర్ సునీత పెళ్లి డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సింగర్ సునీత పెళ్లి వార్త సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ప్రముఖ మీడియా ప్రముఖుడు మ్యాంగ్ రామ్‌తో సునీత నిశ్చితార్థం ఇటీవల జరిగింది. అంతకు ముందు నుంచి వార్తలు వస్తున్నా కూడా తన పెళ్లిపై ఏ రోజు కూడా స్పందించలేదు ఈమె. అయితే నిశ్చితార్థం అనంతరం వీరి పెళ్లి వాయిదా పడిందని, ఆగిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలో వారి పెళ్లి తేదీ ఖరారు చేసినట్టు సమాచారం. అన్నీ కుదిరితే డిసెంబర్ 26న పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. అంతేకాదు.. వచ్చే ఏడాది జనవరి నుంచి మే నెల వరకు మంచి మూహూర్తాలు లేకపోవడంతో డిసెంబర్ 26న రామ్ సునీతల వివాహం జరగనుందని సమాచారం.


Next Story

Most Viewed