వాడిని వదిలేది లేదు : సునీత

by  |
వాడిని వదిలేది లేదు : సునీత
X

సెలెబ్రిటీల పేరు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేయడం.. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు లాగడం చూస్తూనే ఉన్నాం. విజయ్ దేవరకొండ, అజయ్ భూపతి, అల్లు అరవింద్ లాంటి సెలబ్రిటీల పేరు వాడి ఇప్పటికే సైబర్ నేరగాళ్లు జైలు ఊచలు లెక్క పెడుతుండగా.. తాజాగా సింగర్ సునీత పేరు చెప్పి డబ్బులు కాజేస్తున్నట్లు తెలిసింది.

అనంతపూర్‌కు చెందిన చైతన్య అనే వ్యక్తి సునీతకు బంధువు అని నమ్మించి మోసం చేస్తున్నట్లు తెలిసింది. తన పేరు, తన కుటుంబ సభ్యుల పేర్లు వాడుతూ పైసలు లాగుతున్నాడని సమాచారం. కాగా దీనిపై స్పందించిన సునీత.. దయచేసి ఇలాంటి వ్యక్తులను నమ్మకూడదని సూచించింది. చైతన్య అనే వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదన్న సునీత.. ఆ మోసగాన్ని ఊరికే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ ఇంట్లో సేఫ్‌గా ఉండాలని సూచించిన సునీత.. బయటకు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.


Next Story

Most Viewed