ఘనంగా సింగర్ సునీత రెండో పెళ్లి

83

దిశ,వెబ్‌డెస్క్: గాయని సునీత పెళ్ళి ఘనంగా జరిగింది. రామ్‌ వీరపనేనితో కలిసి ఏడడుగులు వేసింది. హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని అమ్మపల్లి కోదండ రామాలయంలో సునీత, రామ్ వీరపనేని వివాహ వేడుకలు జరిగాయి.ఈ పెళ్లికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్, హీరో నితిన్, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.

19ఏళ్ల వయస్సులో సునీత, కిరణ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. తొలత కిరణ్.. సునీతను ప్రేమిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఒకటిన్నర సంవత్సరం తరువాత కిరణ్ లవ్ ప్రపోజల్ కు సునీత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కిరణ్ తో ఏడడగులు నడిచింది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో సునీత.., కిరణ్ నుంచి డైవర్స్ తీసుకుంది. తన తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్నారు.

తాజాగా సునీత ప్రముఖ డిజిటల్ వ్యాపార వేత్త రామ్ వీరపనేని రెండోవివాహం చేసుకున్నారు. శుక్రవారం  రామ్ వీరపనేని – సింగర్ సునీతల వివాహం  శంషాబాద్‌లోని అమ్మపల్లి కోదండ రామాలయంలో ఘనంగా జరిగింది.