కమల్ దేవుడు కాదు.. చేతకాని వ్యక్తి: సింగర్ సుచిత్ర

by  |
కమల్ దేవుడు కాదు.. చేతకాని వ్యక్తి: సింగర్ సుచిత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ సుచిత్రపై ఫైర్ అవుతున్నారు లోక నాయకుడు కమల్ హాసన్ ఫ్యాన్స్. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సుచిత్ర హౌజ్‌లో తక్కువ రోజులే ఉన్నా మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఈ రియాలిటీ షో ద్వారా మరింత మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న సుచిత్ర.. షో ఎండ్ అయిన తర్వాత లేటెస్ట్‌గా హోస్ట్ కమల్ హాసన్‌ను విమర్శిస్తూ పోస్ట్ పెట్టింది.

తన ఇన్ స్టాగ్రాం పోస్ట్‌లో కమల్‌ను ‘పప్పెట్ మాస్టర్’ అంటూ కామెంట్ చేసిన సింగర్ కమ్ వీజే.. అర్థం లేని బ్రాండ్, తెలివి తక్కువ ఇల్లు అంటూ బిగ్ బాస్ హౌజ్ నిర్వాహకులను తిట్టేసింది. తనకు సింథటిక్ చొక్కాను..ఇచ్చి ఖాదిగా ప్రదర్శించాలని చెప్పారని ఆరోపించింది. మిస్టర్ కమల్ హాసన్ అసహ్యకరమైన మానవుడు అని..అతను దేవుడు కాదు..ఓ చేతకాని వ్యక్తి అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌పై కమల్ ఫ్యాన్స్ ఫైర్ కావడంతో వెంటనే పోస్ట్ డిలీట్ చేసిన సుచిత్ర.. తన ఇన్ స్టాగ్రాం ఎకౌంట్‌ను ప్రైవేట్‌లో పెట్టేసింది. కాగా, కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న తమిళ్ బిగ్ బాస్ రియాలిటీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. సీజన్ 4లో ఆరి అర్జున విజేతగా నిలవగా, బాలాజీ మురుగదాస్ ఫస్ట్ రన్నర్‌గా నిలిచారు.

Next Story

Most Viewed