- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగర్ రేఖ ఆత్మహత్య?
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. సింగర్ రేఖ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బృందావన్ గార్డెన్స్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితితో రేఖ చనిపోయి కనిపించింది. విషయం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో రేఖ మృతదేహాన్ని వారు గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అయితే, ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. సింగర్ రేఖ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బృందావన్ గార్డెన్స్‌లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితితో రేఖ చనిపోయి కనిపించింది. విషయం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. తన ఇంట్లోని బాత్‌రూమ్‌లో రేఖ మృతదేహాన్ని వారు గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అయితే, ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా, భర్త నుంచి విడిపోయిన రేఖ.. చైతన్య అనే మరో వ్యక్తిని ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఈమె పలు టీవీ షోలలో పాటలు పాడటమే కాకుండా, పలు సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేసింది.
Next Story






