- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులను ఆశ్రయించిన సింగర్ ‘మధుప్రియ’.. ఎందుకో తెలుసా.?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సింగర్ మధుప్రియ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా వేధిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ద్వారా తనకు అభ్యంతరకర సందేశాలు పంపిస్తున్నారని.. గత రెండు రోజులుగా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపుల కారణంగా తాను మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మధుప్రియ.. పోలీసులను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సింగర్ మధుప్రియ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా వేధిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ద్వారా తనకు అభ్యంతరకర సందేశాలు పంపిస్తున్నారని.. గత రెండు రోజులుగా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వేధింపుల కారణంగా తాను మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మధుప్రియ.. పోలీసులను కోరారు. మధుప్రియ.. ‘ఆడపిల్లనమ్మా’ అంటూ పాడిన పాట పాడి పాపులర్ అయ్యారు. మధుప్రియ బిగ్ బాస్-1లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.
Next Story






