- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ : మంచిర్యాలలో మరో ‘గని’ ప్రమాదం.. అండర్ మేనేజర్ మృతి
<p>దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో మరో గని ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మందమర్రి కేకే ఓసీపీ క్వారీలో జరిగిన ప్రమాదంలో అండర్ మేనేజర్ పురుషోత్తం మరణించారు. 240 హెచ్‌పీ పంప్ హౌస్ సంపులో ప్రమాదవశాత్తు జారీ పడి మేనేజర్ మృతి చెందినట్టు సమాచారం. విషయం తెలియడంతో సింగరేణి రెస్క్యూ టీం వెంటనే అతన్ని అందులోనుంచి బయటకు తీశారు. అప్పటికే అండర్ మేనేజర్ ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. ఇటీవలి కాలంలో సింగరేణిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్న విషయం […]</p>

X
దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లాలో మరో గని ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మందమర్రి కేకే ఓసీపీ క్వారీలో జరిగిన ప్రమాదంలో అండర్ మేనేజర్ పురుషోత్తం మరణించారు. 240 హెచ్‌పీ పంప్ హౌస్ సంపులో ప్రమాదవశాత్తు జారీ పడి మేనేజర్ మృతి చెందినట్టు సమాచారం. విషయం తెలియడంతో సింగరేణి రెస్క్యూ టీం వెంటనే అతన్ని అందులోనుంచి బయటకు తీశారు. అప్పటికే అండర్ మేనేజర్ ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది.
ఇటీవలి కాలంలో సింగరేణిలో వరుసగా ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. మొన్నటికి మొన్న శ్రీరాంపూర్ గనిలో చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు సింగరేణి కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. దానికి బాధ్యత వహిస్తూ మేనేజ్మెంట్ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు మృతుల కుటుంబంలో ఒకరి ఉద్యగం ప్రకటించింది.
Next Story






