క్రేజీ ఫ్యాన్.. హీరోతో కలిసి ఒకే బెడ్‌పై అలా చేస్తే…

by  |
క్రేజీ ఫ్యాన్.. హీరోతో కలిసి ఒకే బెడ్‌పై అలా చేస్తే…
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. గతంలోనూ క్రేజీ ఫ్యాన్ ఎక్స్‌పీరియన్స్‌లు చూసిన సిద్ధార్థ్.. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ పంపించిన గిఫ్ట్ గురించి ఓపెన్ అయ్యాడు. కొద్ది రోజుల క్రితం తనకు వచ్చిన ఓ బాక్స్ డెలివరీ ఓపెన్ చేసి చూస్తే బ్యూటిఫుల్ పిల్లో ఉందని తెలిపాడు. ‘ఇది రోజూ నేను పడుకునేటప్పుడు యూజ్ చేసే పిల్లో అని, దీనిపై నువ్వు కూడా పడుకుంటే.. మనిద్దరం కలిసి పడుకున్న ఫీలింగ్ ఉంటుంది’ అని కార్డు మీద రాసి ఉన్నట్లు తెలిపాడు. తను యూజ్ చేసిన పిల్లో అని తెలిసేందుకు దానిపై ఆ క్రేజీ ఫ్యాన్ హెయిర్ కూడా ఉండేలా ప్లాన్ చేసి పంపించిందని చెప్పాడు. ఇక మే 2019లో సిద్ధార్థ్‌ను కలిసేందుకు ఫాస్టింగ్ చేసిన ఫ్యాన్ గర్ల్.. ఏజెన్సీ బయట వెయిట్ చేసింది. కాగా సిద్ధార్థ్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కియారాతో కలిసి నటించిన ‘షేర్షా’ సినిమా విడుదలకు సిద్ధం కాగా.. ‘మిషన్ మజ్ను, థాంక్ గాడ్’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.



Next Story

Most Viewed