యంగ్ హీరోల మధ్య వార్..

by  |
యంగ్ హీరోల మధ్య వార్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరోస్ సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ మధ్య వార్ నడుస్తుందని బీటౌన్ టాక్. కత్రినా కైఫ్‌తోపాటు ఈ ఇద్దరు హీరోలు హార్రర్ మూవీ ‘ఫోన్ బూత్’లో స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా.. వీరిద్దరి నడుమ శత్రుత్వం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా దీనిపై స్పందించిన సిద్ధాంత్.. అవును మేమిద్దం శత్రువులమే. కానీ, ఫుట్ బాల్ కోర్టులో అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. అంతకు మించి మా మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని.. తను బ్రదర్ లాంటి వాడని చెప్పాడు. మా మధ్య బ్రొమాన్స్ మాత్రమే ఉందంటున్న సిద్ధాంత్..హెల్దీ కాంపిటీషన్ కూడా ఉందని స్పష్టం చేశారు.

యాక్టింగ్ పరంగా ఇషాన్‌కు ఏ విషయం తెలిసినా తనకు చెప్తాడని.. నేను కూడా అంతేనని తెలిపాడు. ఈ క్రమంలో ఫ్రెండ్ షిప్, బ్రదర్ హుడ్ బాండ్ డెవలప్ అయిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శకున్ బత్ర డైరెక్షన్‌లో వస్తున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటుండగా.. అక్కడే ఉన్న ఇషాన్‌తో కలిసి గోవాలో ఎలా ఎంజాయ్ చేశారో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేశాడు. దీంతో యంగ్ హీరో వార్ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.


Next Story