- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థుల సందేహాల నివృత్తికి అవకాశం
<p>దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని 8,9,10వ తరగతులకు చెందిన విద్యార్థులు వివిధ సబ్జెక్టులపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్టు సిద్దిపేట విద్యాశాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. రెండో శనివారం మరియు ఇతర ప్రభుత్వ సెలవులను మినహాయించి ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ T-SAT నిపుణ ఛానల్ ద్వారా గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో రాష్ట్ర స్థాయి నిపుణుల ద్వారా […]</p>

దిశ, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని 8,9,10వ తరగతులకు చెందిన విద్యార్థులు వివిధ సబ్జెక్టులపై తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్టు సిద్దిపేట విద్యాశాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. రెండో శనివారం మరియు ఇతర ప్రభుత్వ సెలవులను మినహాయించి ప్రతి శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ T-SAT నిపుణ ఛానల్ ద్వారా గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులలో రాష్ట్ర స్థాయి నిపుణుల ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కల్పించారు.
విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయం తెలియజేసి తమ పాఠశాల పరిధిలో ఎంతమంది విద్యార్థులు సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు అనే విషయాన్ని సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా మండల విద్యాధికారులకు అందజేయాలనీ కోరారు.






