- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. టీఆర్‌ఎస్‌లోకి సిద్ధిపేట కలెక్టర్?
<p>దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు అందజేశారు. వెంకట్రామిరెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని సీఎం కేసీఆర్ ఇవాళ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ అధిష్టానం నుంచి ఆ సమాచారం అందుకున్న వెంటనే వెంకట్రామిరెడ్డి రాజీనామా లేఖను సీఎస్‌కు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు అందజేశారు. వెంకట్రామిరెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని సీఎం కేసీఆర్ ఇవాళ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ అధిష్టానం నుంచి ఆ సమాచారం అందుకున్న వెంటనే వెంకట్రామిరెడ్డి రాజీనామా లేఖను సీఎస్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన రాజీనామాకు ఆమోదం లభించాల్సి ఉంది.
కాగా, వచ్చే ఏడాదిలోనే వెంకట్రామిరెడ్డి రిటైర్ కావాల్సి ఉంది. అయితే ఈ నెల 11వ తేదీన సీఎం కేసీఆర్‌ను వెంకట్రామిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
- Tags
- collector






