మూవీ టైటిల్ రగడ.. డైరెక్టర్ గొంతు పిసికిన హీరో

by  |
మూవీ టైటిల్ రగడ.. డైరెక్టర్ గొంతు పిసికిన హీరో
X

దిశ, సినిమా : బాలీవుడ్ డైరెక్టర్ శకున్ బత్రా డైరెక్ట్ చేసింది రెండు సినిమాలే అయినా, సెపరేట్ జోనర్స్‌తో రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఆయన డైరెక్షన్‌లో వచ్చే నెక్స్ట్ మూవీ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. తన తదుపరి చిత్రాన్ని సిద్ధాంత్ చతుర్వేది, కత్రినాకైఫ్ జంటగా తెరకెక్కిస్తున్నాడు. కనీసం ఈ సినిమా టైటిల్ కూడా తెలియని హీరో సిద్ధాంత్‌.. మూవీ అప్‌డేట్స్ తెలుసుకునేందుకు ఆదివారం డైరెక్టర్ శకున్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందంటే..

సినిమా టైటిల్ తనకైనా చెబుతావా చెప్పవా? అని సిద్ధాంత్ డైరెక్టర్‌ను అడగ్గా.. నేను ఇప్పుడే రివీల్ చేయలేనని శకున్ సమాధానమిచ్చాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సిద్ధాంత్ డైరెక్టర్‌ను గొంతుప‌ట్టి పిసికి పైకిలేపి ఎత్తి కుదేశాడు. అయితే ఇదేదో సీరియస్ వ్యవహారం కాదు.. ఏదో సరదాగా చేసిన ప్రయత్నం మాత్రమే. ఇక ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ను సిద్ధాంత్ తన ఇన్‌స్టాలో ‘మరోసారి విఫలయత్నం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వీడియోపై స్పందించిన క‌త్రిన.. సిద్ధాంత్ ఫ్యాన్స్ కూడా టైటిల్ రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పింది. కాగా ఈ చిత్రంలో దీపికా ప‌దుకొనే, అన‌న్యా పాండే కూడా న‌టిస్తుండగా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు.



Next Story

Most Viewed