దీపికతో వర్క్ డ్రీమ్‌లా ఉంది

by  |
దీపికతో వర్క్ డ్రీమ్‌లా ఉంది
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గల్లీ బాయ్’ రాప్ సాంగ్‌తో పాపులర్ అయిన సిద్ధాంత్ చతుర్వేది.. బెస్ట్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ కెరియర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే షకున్ బత్ర డైరెక్షన్‌లో దీపికా పదుకొనే, అనన్య పాండే కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన సిద్ధాంత్ కంప్లీట్ చేశాడు కూడా. కాగా ఈ సినిమాలో డైరెక్టర్ అండ్ కో స్టార్స్‌తో వర్క్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశాడు. దీపికతో కలిసి పని చేయడం కలలా ఉందన్న సిద్ధాంత్.. యాక్టింగ్ విషయంలో తనను తాను పూర్తిగా సబ్మిట్ చేసుకుని, ఆ పాత్ర నిజంగా ఉందనేలా నమ్మిస్తుందని చెప్పాడు. దర్శకులు షకున్ బత్ర ఈ సినిమా ద్వారా ఇండియన్ సినిమా బౌండరీస్‌ను పుష్ చేస్తాడని, ఆయన చేసే పని ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందని తెలిపాడు సిద్ధాంత్.

ప్రస్తుతం కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ‘ఫోన్ భూత్’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్న సిద్ధాంత్.. ముగ్గురు కూడా సూట్స్ ధరించి గెంతులేస్తున్న పిక్ షేర్ చేసి ఈ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా హిలేరియస్ స్క్రిప్ట్ చదువుతుంటే బ్లాస్ట్ అయిపోయాయని, ముగ్గురి నడుమ సాలిడ్ జుగల్ బందీ ఉంటుందని చెప్పాడు. ఈ సినిమా నెక్స్ట్ పాప్ కల్చర్‌గా ఉండాలనుకుంటున్నాం అని తెలిపాడు.

‘బంటి ఔర్ బబ్లీ 2’ సినిమాలోనూ నటిస్తున్న సిద్ధాంత్.. ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తూ, తన ఊహల్లో ఉన్న అన్ని పాత్రల్లోనూ జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. సినిమా హాల్స్‌లోకి వచ్చిన ప్రతీసారి ఆడియన్స్ తన నుంచి కొత్తదనం ఎక్స్‌పీరియన్స్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.


Next Story

Most Viewed