బాబుకు బిగ్ షాక్.. టీడీపీ వికెట్ పడింది

by  |
బాబుకు బిగ్ షాక్.. టీడీపీ వికెట్ పడింది
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి బిగ్ షాక్ తగలనుంది. బాబు గత ప్రభుత్వ హయాంలో కేబినెట్ సహచరుడైన శిద్ధా రాఘవరావు పార్టీని వీడనున్నారు. వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ నేతలు పార్టీ మారేందుకు వెయిటింగ్‌లో ఉన్నారన్న వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేతల్లో ఒకరైన శిద్దా రాఘవ రావు తన కుమారుడు సుధీర్‌తో కలిసి పార్టీ మారనుండడం జిల్లా టీడీపీలో కలకలం రేపింది. రాఘవరావు చేరిక వెనక టీడీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కరణం బలరాం ఉండడం విశేషం.

వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి రేపు సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కుమారుడు సుధీర్, స్థానిక నేతలతో కలిసి ఆయన వైఎస్సార్సీపీలో చేరనున్నారు. కాగా, శిద్దా రాఘవరావు ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. జాతీయ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డి చేతిలో ఓడిపోయారు.



Next Story