- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళను అసభ్యకర పదజాలంతో దూషించిన ఎస్సై..
<p>దిశ , పెద్దపల్లి : తమ సామాజిక వర్గానికి చెందిన కొందరు తమను కుల బహిష్కరణ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అలా వచ్చిన మహిళను ఓ ఎస్సై దుర్భాషలాడిన ఘటన సుల్తానాబాద్‌లో చోటు చేసుకుంది. బాధిత మహిళ ముస్కే సునీత తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన తమ కుటుంబాన్ని కొందరు అధికార బలంతో కుల బహిష్కరణ చేశారని ఆరోపించింది. […]</p>

దిశ , పెద్దపల్లి : తమ సామాజిక వర్గానికి చెందిన కొందరు తమను కుల బహిష్కరణ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అలా వచ్చిన మహిళను ఓ ఎస్సై దుర్భాషలాడిన ఘటన సుల్తానాబాద్‌లో చోటు చేసుకుంది. బాధిత మహిళ ముస్కే సునీత తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన తమ కుటుంబాన్ని కొందరు అధికార బలంతో కుల బహిష్కరణ చేశారని ఆరోపించింది.
గత పది సంవత్సరాలుగా తమ కుటుంబానికి ఎలాంటి వివాహ ఆహ్వానాలు ఇవ్వకుండా మాజీ సర్పంచ్ సతీష్ అధికార బలంతో మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తమను ఎస్సై లింగారెడ్డి అసభ్యకర పదజాలంతో దూషించారని తెలిపారు. ఎస్సై ఉపేంద్ర రావు ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడుతున్న సందర్భంలో బాధిత మహిళ పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని న్యాయం చేయాలంటూ బోరున విలపించింది.






