సీఐ సహా ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్..

298

దిశ, హైదరాబాద్ ప్రతినిధి : నిషేధిత గంజాయి కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐ సహా ఇద్దరు ఎస్సైలు సస్పెండ్ కు గురయ్యారు. గంజాయి కేసులో మంగళహాట్ సిఐ రణ్వీర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ ఎం.వెంకటకృష్ణ, షాయినాథ్ గంజ్ సబ్ ఇన్స్పెక్టర్ కె.రాము నాయుడుల మీద ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సీఐ సహా ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఈ ముగ్గురుని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సస్పెండ్ అయిన సిఐతో పాటు ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను కమిషనరేట్ కు అటాచ్ చేశారు. ఈ వ్యవహారం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై సర్వత్రా చర్చ సాగుతోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..