ఆ విషయంలో ఐశ్వర్యరాయ్ నచ్చదు :బిగ్ బీ కూతురు

by  |
ఆ విషయంలో ఐశ్వర్యరాయ్ నచ్చదు :బిగ్ బీ కూతురు
X

దిశ, సినిమా: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్.. తన అన్నావదినలు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌‌ల గురించి ‘కాఫీ విత్ కరణ్’ షోలో చేసిన కామెంట్స్, కాంప్లిమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐశ్వర్య రాయ్‌ను సెల్ఫ్ మేడ్ యాక్టర్, స్ట్రాంగ్ ఉమెన్, ఫెంటాస్టిక్ మదర్‌ అని కొనియాడిన శ్వేత.. టాలెంట్, హార్డ్ వర్క్ ఐశ్వర్యను సినిమా ఇండస్ట్రీలో గొప్పగా నిలబెట్టాయని తెలిపింది. కానీ తనకు కాల్ చేసినా, మెసేజ్ చేసినా వెంటనే రెస్పాన్స్ ఉండదని.. ఎప్పుడోగానీ రిప్లై ఇవ్వదన్న శ్వేత, వదినలో ఆ విషయం నచ్చదని తెలిపింది. కానీ తనను చూసి టైమ్ మేనేజ్‌మెంట్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఇక అన్న అభిషేక్ బచ్చన్.. కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత అంటే ఇష్టమని తెలిపిన శ్వేతా బచ్చన్.. తను ఫ్యామిలీని ఆరాధిస్తాడని, కుటుంబానికి అంకితమైపోయాడని చెప్పింది. కేవలం బెస్ట్ కొడుకు మాత్రమే కాదు, బెస్ట్ భర్త కూడా అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. కానీ అన్నీ తనకే తెలుసని అనుకుంటాడని, ఆ విషయంలో అభిషేక్‌ను చూస్తే కోపమొస్తుందన్న శ్వేత.. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇష్టమని వెల్లడించింది.


Next Story

Most Viewed