ప్రభాస్‌పై శ్రుతి హాసన్ పొగడ్తల వర్షం

by  |
ప్రభాస్‌పై శ్రుతి హాసన్ పొగడ్తల వర్షం
X

దిశ, సినిమా : ‘క్రాక్, వకీల్ సాబ్’ సినిమాలతో టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న శ్రుతిహాసన్.. ప్రస్తుతం ‘లాభం, సలార్’ చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న ‘సలార్’ ఫస్ట్ షెడ్యూల్‌ను ఇటీవలే కంప్లీట్ చేసిన శ్రుతి, ప్రభాస్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి వెల్లడించింది.

ప్రభాస్‌కు జోడీగా శ్రుతి నటించడం ఇదే మొదటిసారి కాగా.. తను వెరీ సింపుల్ పర్సన్ అని, సెట్‌లో అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాడని తెలిపింది శ్రుతి. తాను స్టార్ అన్న విషయాన్ని ప్రభాస్ పూర్తిగా పక్కనబెట్టేస్తాడని చెప్పింది. ప్రభాస్‌తో ఎవరైనా సరే కంఫర్టబుల్‌గా నటించొచ్చని, చాలా ప్రేమగా మాట్లాడతారని చెప్పుకొచ్చింది. ఇక ఈ చిత్రంలో శ్రుతి పవర్‌ఫుల్ జర్నలిస్ట్ రోల్ పాత్రలో నటిస్తున్నదని తెలుస్తోంది. కాగా తెలంగాణలోని గోదావరిఖనిలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయినట్లు పేర్కొన్న మూవీ యూనిట్, ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తోంది.



Next Story

Most Viewed