నువ్వు మారిపోయావ్ శ్రుతి.. నెటిజన్ల కామెంట్స్

by  |
నువ్వు మారిపోయావ్ శ్రుతి.. నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: హీరోయిన్ శ్రుతి హాసన్ దీపావళి పండుగ సందర్భంగా సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. ఎప్పుడూ బ్లాక్ అండ్ వైట్ జీన్స్, టీ షర్ట్స్‌తో సోషల్ మీడియాలో కనిపించే ఈ భామ.. దివాళీని పురస్కరించుకుని ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులతో ట్రెడిషనల్ టచ్ ఇచ్చింది.

బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో డిజైన్ చేసిన డ్రెస్.. మెడలో సిల్వర్ కలర్ చోకర్, సరికొత్త చెవిపోగులు, నేచురల్ హేయిర్ స్టైల్, సింపుల్ మేకప్, స్కిన్ కలర్ లిప్ స్టిక్‌తో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఇక ఆమె సరికొత్త రూపాన్ని చూసి ఫిదా అయిన నెటిజన్లు.. ‘నువ్వు మారిపోయావ్ శ్రుతి. ఇంత అందంగా ఉన్నావేంటి’ అంటూ భారీగా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సాలార్‌’లో ఈ బ్యూటీ కనిపించనుంది.


Next Story

Most Viewed