- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని జీవన సాఫల్య అవార్డుకు ‘భగీరథ’
<p>దిశ, సినిమా : పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరావు పేరిట శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేసిన ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారానికి ఈ ఏడాది సీనియర్ పాత్రికేయుడు భగీరథను ఎంపిక చేశామని అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ గత రెండు దశాబ్దాలుగా ఎందరో సినీ ప్రముఖులను, సేవా మూర్తులను సత్కరిస్తూ యువతరానికి స్ఫూర్తినిస్తోందన్నారు. ఈ సంస్థ నిర్వాహకురాలు, గాయకురాలు ఆమని తెలంగాణ ప్రభుత్వ బిసి సంక్షేమశాఖలో ఉన్నతాధికారిణిగా పనిచేస్తున్నారన్న […]</p>

దిశ, సినిమా : పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరావు పేరిట శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఏర్పాటుచేసిన ఉత్తమ పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారానికి ఈ ఏడాది సీనియర్ పాత్రికేయుడు భగీరథను ఎంపిక చేశామని అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ గత రెండు దశాబ్దాలుగా ఎందరో సినీ ప్రముఖులను, సేవా మూర్తులను సత్కరిస్తూ యువతరానికి స్ఫూర్తినిస్తోందన్నారు. ఈ సంస్థ నిర్వాహకురాలు, గాయకురాలు ఆమని తెలంగాణ ప్రభుత్వ బిసి సంక్షేమశాఖలో ఉన్నతాధికారిణిగా పనిచేస్తున్నారన్న ఆయన.. 2001లో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థను డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభించారని తెలిపారు.
ఆ కృతజ్ఞతతో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఆయన పుట్టిన రోజు(సెప్టెంబర్ 20)న పాత్రికేయులను సత్కరిస్తూ వస్తున్నామన్నారు. సినిమా పాత్రికేయునిగా నాలుగు దశాబ్దాల అనుభవమున్న భగీరథ గారిని ఈ నెల 20న రవీంద్ర భారతిలో సత్కరించనున్నట్లు వెల్లడించారు.






