- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలిసి బతికేంత ప్రేమ లేనప్పుడు విడిపోవడమే మంచిది: శృతి
<p>శృతి హాసన్… లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తండ్రికి తగిన కూతురిగా పేరు సంపాదించింది. ముక్కుసూటి తనంతో ఇండస్ట్రీలో వివాదాలు ఎదుర్కొన్నా సరే తను తన మాటకి కట్టుబడి ఉంటుంది. ఈ మధ్య మొహానికి సర్జరీ చేసుకుందని కొందరు విమర్శలకు దిగితే… తగిన సమాధానం చెప్పి బుద్ధి చెప్పింది కూడా. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో పెంపుడు జంతువులు, మ్యూజిక్ తో సహవాసం చేస్తూ ఎంజాయ్ చేస్తున్న శృతి… ఓ చానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర […]</p>

శృతి హాసన్… లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తండ్రికి తగిన కూతురిగా పేరు సంపాదించింది. ముక్కుసూటి తనంతో ఇండస్ట్రీలో వివాదాలు ఎదుర్కొన్నా సరే తను తన మాటకి కట్టుబడి ఉంటుంది. ఈ మధ్య మొహానికి సర్జరీ చేసుకుందని కొందరు విమర్శలకు దిగితే… తగిన సమాధానం చెప్పి బుద్ధి చెప్పింది కూడా. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో పెంపుడు జంతువులు, మ్యూజిక్ తో సహవాసం చేస్తూ ఎంజాయ్ చేస్తున్న శృతి… ఓ చానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది.
భార్యాభర్తలు విడిపోవడం గురించి తన అభిప్రాయాన్ని అడిగితే… కలిసి బతకలేనప్పుడు విడిపోవడమే మంచిదని చెప్పింది. లేదంటే జీవితాంతం మనశ్శాంతి లేకుండా బతకాల్సి వస్తుందని చెప్పింది. అమ్మ నాన్న ఇద్దరు సెలబ్రిటీలు కావడంతో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండేవారని.. ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడి గొడవలు జరిగేవని తెలిపింది. దీంతో ఎవరికి వారు విడిపోదామని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. దీంతో వారిని ఎలాగైనా కలపాలని మొదట్లో అనుకున్నా.. విడిపోతే హ్యాపీగా ఉంటారని అర్థమయ్యాక ఆ ఆలోచన విరమించుకున్నానని తెలిపింది. అందుకే వాళ్లిద్దరు ఇప్పుడు విడిపోయి సంతోషంగా ఉన్నారని.. లేదంటే ఇప్పటికీ రోజూ గొడవ పడుతూ బాధపడుతూ ఉండేవారని తెలిపింది. అందుకే నాకు తెలిసి భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం లేనప్పుడు విడిపోవడమే బెటర్ అని అభిప్రాయపడింది.
Tags : Shruthi Hassan, Kamal Hassan, Tollywood, Kollywood






