రేర్ పిక్.. స్కూల్ డేస్‌లో శ్రియ డ్యాన్స్

by  |
రేర్ పిక్.. స్కూల్ డేస్‌లో శ్రియ డ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ :
బ్యూటిఫుల్ శ్రియ శరణ్ అందానికి ముగ్ధులవ్వని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా ‘ఇష్టం, సంతోషం, నువ్వే నువ్వే’ లాంటి సినిమాల్లో తన క్యూట్‌నెస్‌కు పడిపోయారు. తన ప్రెట్టీనెస్‌‌కు టాలెంట్, లక్ కూడా యాడ్ కావడంతో సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ రాణించగలిగింది ముద్దుగుమ్మ. దశాబ్ధం పాటు స్టార్ హీరోయిన్‌‌గా కొనసాగిన శ్రియ.. ఆ తర్వాత రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ఆండ్రిని పెళ్లి చేసుకుంది. ఇక మ్యారేజ్ తర్వాత కూడా కంటెంట్ ఉన్న రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది.

అయితే, సినిమాల్లోకి వచ్చేందుకు మాత్రం తను నేర్చుకున్న సాంప్రదాయ నృత్యమే కారణమని.. ఇంత గొప్ప జీవితం ప్రసాదించింది డ్యాన్స్ మాత్రమే అని చాలా సందర్భాల్లో చెప్పింది శ్రియ. డ్యాన్స్ అంటే పిచ్చి ఉన్న నటుల్లో ఒకరైన శ్రియ.. తన స్కూల్ డేస్‌లో డ్యాన్స్ చేసిన ఒక ఫొటోను తాజాగా పోస్ట్ చేసింది. డ్యాన్స్.. డ్యాన్స్.. డ్యాన్స్.. అంటూ యాన్యువల్ డే ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తున్న క్యూటెస్ట్ పిక్‌ను అభిమానులతో పంచుకుంది. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చీరలో కథక్ నృత్యం చేస్తున్న శ్రియ.. డ్యాన్స్‌ను ఎంజాయ్ చేస్తూ మరింత అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగులో ‘గమనం’ సినిమాలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్న తను.. షూటింగ్ మిస్ అవుతున్నట్లు తెలిపింది. 2020వ సంవత్సరం మరీ ఇంత ఘోరంగా ఉందేంటి అంటూ నిట్టూరుస్తోంది.


Next Story

Most Viewed