అలా సినిమాల్లోకి వచ్చా : శ్రియ

by  |
అలా సినిమాల్లోకి వచ్చా : శ్రియ
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్‌లో స్టార్ హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ పొందిన భామ.. శ్రియ శరణ్. అటు బాలీవుడ్‌లోనూ రాణించిన ఈ భామ.. ఓ ఇంటర్వ్యూలో తనకు సినిమాల్లో ఎలా అవకాశం వచ్చింది? అన్న విషయాన్ని వెల్లడించింది. హరిద్వార్‌లోని చిన్న కాలనీలో ఉండే తనకు డ్యాన్స్ అంటే ఇష్టమని.. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నానని తెలిపింది. టీనేజ్‌లో తమ గురువు ద్వారా ఓ ఆల్బమ్‌లో నటించే అవకాశం వచ్చిందని.. ఆ ఆల్బమ్‌ను చూసిన దర్శక, నిర్మాతలు తెలుగు సినిమా అవకాశం ఇచ్చారని.. హైదరాబాద్‌లో స్క్రీన్ టెస్ట్ చేశాక కింగ్ నాగార్జున సరసన ‘సంతోషం’ సినిమాలో సెలెక్ట్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఆ సినిమా హిట్ అయ్యాక తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలు వచ్చినట్లు చెప్పింది శ్రియ.

నాగార్జునతో చాలా సినిమాలు చేశానని.. తనతో వర్క్ చేయడం బాగుంటుందని తెలిపింది. మ్యూజిక్ ఇష్టపడే నాగ్.. వర్క్‌ఔట్స్ చేస్తాడని, తనతో పని చేయడం సరదాగా ఉంటుందని చెప్పింది. రజనీకాంత్‌తో కలిసి నటించడం చాలా గొప్ప విషయమన్న శ్రియ.. శివాజీ సినిమా చేస్తున్నప్పుడు తను చిన్న అమ్మాయిని.. అయినా కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారని చెప్పింది. అందరితో ఫ్రెండ్లీగా ఉంటారని.. సినిమా, స్క్రిప్ట్ గురించి చర్చిస్తారని తెలిపింది.


Next Story

Most Viewed