రాశి టార్చర్ పెట్టింది : నగ్నం హీరోయిన్

by  |
రాశి టార్చర్ పెట్టింది : నగ్నం హీరోయిన్
X

రామ్‌గోపాల్ వర్మ ‘నగ్నం’ చిత్రం హీరోయిన్ శ్రీ రాపాక.. టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఈ సినిమాలో చాలా బోల్డ్‌గా కనిపించిన ఈ బ్యూటీ.. వర్మతో మరో సినిమా కూడా చేస్తానంటోంది. నగ్నం సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన శ్రీ రాపాక.. తన తాజా ఇంటర్వ్యూలో హీరోయిన్ రాశీఖన్నాపై ఆరోపణలు చేసింది. రాశీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతీసిందని తెలిపింది.

ఇంతకు ముందు పలు సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా వర్క్ చేసిన ఆమె.. రాశితో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది. తనకు కేవలం చీర కట్టేందుకే.. ఉదయం మూడు గంటలకు సెట‌కు రమ్మని చెప్పేదని, ఎంత దూరంలో ఉన్నా సరే.. కచ్చితంగా రావాలని ఆర్డర్ వేసేదని ఆరోపించింది. ఇది జరిగింది సుప్రీమ్ సినిమా టైమ్‌లోనని చెప్పింది. 300 మందికి పైగా ఉండే సెట్‌లో.. మహిళలు కూడా ఉంటారని, అయినా సరే తనను రావాలని ఇబ్బంది పెట్టేదని తెలిపింది. డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా ఈ విషయం తెలుసని వెల్లడించింది.

అయితే శ్రీ రాపాక.. ఆరోపణల గురించి రాశీఖన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.


Next Story