వ్యాపార రంగంలోకి జెర్సీ హీరోయిన్

by  |
వ్యాపార రంగంలోకి జెర్సీ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘జెర్సీ’ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటోంది. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ… ఇప్పుడు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతోంది. ప్రస్తుతం తమిళ్‌లో విశాల్‌తో కలిసి ‘చక్ర’ సినిమాలో నటిస్తున్న శ్రద్ధా .. రెస్టారెంట్ ఓపెన్ చేయబోతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఈ భామ. రెస్టారెంట్‌ కన్నా కొంచెం తక్కువగా.. కేఫ్‌కు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నానని తెలిపింది. సాధారణంగా ఫుడ్ లవర్‌ను కాబట్టి ఆ క్రమంలోనే ఈ ఐడియా వచ్చినట్లు చెప్పింది. త్వరలో ఓపెన్ చేయబోయే రెస్టారెంట్‌ను ఆదరిస్తారనే నమ్ముతున్నానని అభిప్రాయపడింది. చెన్నై కూలెస్ట్ సలాడ్ బార్ అండ్ కేఫ్‌గా గుర్తుండిపోతుందన్న శ్రద్ధా…. ఇక్కడ వంద శాతం ఆరోగ్యకరమైన ఫుడ్ దొరుకుతుందని చెప్పింది.

Tags: Jersey Heroine, Shradha Srinath, Business, Chakra



Next Story

Most Viewed