‘పుష్ప’ కోసం శ్రద్ధ న్యూ అవతార్!

by  |
‘పుష్ప’ కోసం శ్రద్ధ న్యూ అవతార్!
X

బాలీవుడ్ క్యూట్ బ్యూటీ శ్రద్ధ కపూర్.. సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రభాస్ సరసన నటించి మెప్పించిన భామ.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం ఓ సరికొత్త ప్రయోగం చేయబోతోంది. ఫిమేల్ లీడ్ రోల్స్‌తో బాలీవుడ్‌ను ఏలేస్తున్న శ్రద్ధ.. పుష్ప సినిమా కోసం ఐటెం గర్ల్‌గా మారనుందని సమాచారం.

శ్రద్ధ కపూర్‌కు బాలీవుడ్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాహోతో ఇటు సౌత్ ఆడియన్స్‌ను కూడా మెస్మరైజ్ చేసిన క్యూట్ లేడీ.. ఇప్పుడు తన గ్రేస్‌ఫుల్ స్టెప్స్‌తో ఫిదా చేయనుంది. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధను సంప్రదించగా.. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్ చిత్రంలో ఐటెం సాంగ్ అంటే చాలా ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. కాగా, రంగస్థలం చిత్రంలో పూజ హెగ్డే ఐటెం సాంగ్‌లో ఆడి పాడింది. ఇక తన గ్రేస్‌తో డ్యాన్స్ ఇరగదీసే శ్రద్ధ.. బన్నీ స్టెప్స్‌తో మ్యాచ్ చేయగలదని.. ఈ కాంబినేషన్ బాగుంటుందని.. సుక్కు ఇలా ప్లాన్ చేశాడని టాక్.

ఇక ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ కాగా, తను గిరిజన యువతిగా కనిపించనుంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు.

Next Story

Most Viewed