- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షాకింగ్.. కొత్త బట్టలు కొనివ్వలేదని బాలిక సూసైడ్
by Aamani |
X
దిశ, ఆసిఫాబాద్: ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మైనర్‌లు తల్లిదండ్రులపై అలిగి తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదనో.. అడిగింది కొనివ్వలేదన్న చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అప్పపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అప్పపల్లి గ్రామానికి చెందిన శిరీష (15 ) పదవ తరగతి చదువుతున్నది. అయితే, కొత్త బట్టలు కొనివ్వాలని తల్లిదండ్రులను కోరగా.. రేపు తీసుకుందామని తల్లి బదులిచ్చింది. దీంతో ఇప్పుడే కావాలని పట్టుబట్టగా.. తల్లి రేపు తీసుకుందామని వారించింది. దీంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగేసింగి శిరీష. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Advertisement
Next Story